Online Puja Services

ఆదిత్యుని అనుగ్రహం పొందడానికి తేలికైన మార్గాలు ఇవీ !

52.14.22.250

ఆదిత్యుని అనుగ్రహం పొందడానికి తేలికైన మార్గాలు ఇవీ !
-సేకరణ 

ఆదిత్యుని అనుగ్రహం పొందడానికి శాస్త్రాలు చాలా మార్గాలు చెప్పాయి. తేలికైన మార్గాలతోనే సూర్యానుగ్రహం పొందవచ్చు. ప్రతీరోజు సూర్యోదయాత్ పూర్వమే స్నానాదులు పూర్తిచేసుకుని సూర్యునికి నమస్కారం చేసుకోవడం ప్రతీవారి విధి. సూర్యానుగ్రహం పొందాలనుకునే వారు ముఖ్యంగా ఈ విధిని ఆచరించాలి. బ్రహ్మ పురాణంలో చెప్పిన కొన్ని మార్గాలు వాటిల్లో కొన్ని మాత్రమే . 

● మాఘశుద్ధ షష్టి లేదా సప్తమి నాడైనా ఏక భుక్తంతో వ్రతనియమాలను పాటిస్తూ సూర్యుని పూజించినవారు అశ్వమేధ యాగం చేసిన ఫలితాన్ని పొందుతారు.
● సప్తమినాడు ఉపవాస నియమంతో భాస్కరుని పూజించినవారు పరమోత్కృష్ట గతులను పొందుతారు.
● శుక్లసప్తమినాడు ఉపవాసం చేసి తెల్లని రంగు ద్రవ్యాలతో సూర్యుని పూజించినవారు సకలపాపములనుండి విడివడినవారై సూర్యలోకాన్ని చేరుకుంటారు.
● శుక్లసప్తమి ఆదివారం కలిసివస్తే దానికి విజయాసప్తమి అని పేరు. ఆ రోజు చేసిన స్నాన, దాన, తప, హోమ, ఉపవాసాదులు మహాపాతకాలను సైతం నశింపజేస్తాయి.
● చిత్రభానుని అనేకరంగుల సువాసన కలిగిన పువ్వులతో ఉపవాసము చేస్తూ పూజించినవారు అభీష్టసిద్ధులు నెరవేర్చుకోగలరు.
● ఒక నియమంగా నేతితో లేదా నువ్వులనూనెతో దీపాన్ని వెలిగించి ఆదిత్యుని పూజించినవారికి కంటికి సంబంధించిన అనారోగ్యం కలగదు.
● ప్రతిరోజు క్రమం తప్పకుండా సూర్యునికి దీపాన్ని సమర్పించినవారు జ్ఞానదీపంతో ప్రకాశిస్తారు.
● ఎర్రచందనంతో కలిపిన ఎర్రటి పుష్పాలతో సూర్యోదయ సమయంలో అర్ఘ్యాన్ని సమర్పించేవారు ఏడాదిలోగా సూర్యానుగ్రహ సిద్ధిని పొందగలరు.
●పాయసములు, అప్పములు, పండ్లు, కందమూలములు, నేతితో చేసిన వంటకాలు సూర్యునికి అర్పించినవారు అన్ని కోరికలను సాఫల్యం చేసుకోగలరు.
● సూర్యునికై ధ్వజం, ఛత్రం, చామరాలు, జెండాలు శ్రద్ధగా సమర్పించేవారు ఉత్తమగతులను పొందగలరు.
● సూర్యునికై నేతితో తర్పణాలు ఇస్తే సర్వసిద్ధులు కలుగుతాయి. పాలతో తర్పణాలు చేస్తే మానసికతాపములనుండి విముక్తులవుతారు. పెరుగుతో తర్పణాలు ఆచరిస్తే తలచిన పనులు నెరవేరుతాయి.
● ఆదిత్యునికై భక్తిగా ఏ ఏ ద్రవ్యాలను సమర్పిస్తారో అవన్నీ అసంఖ్యాక పదార్థాలుగా తిరిగి వారికి లభిస్తాయి.
● నియమాచారాలకు భావశుద్ధి కూడా చాలా ప్రధానం. భావశుద్ధితో చేసిన అర్చనాదులకు సరైన ఫలం లభిస్తుంది.
● తల భూమిని తాకే విధంగా సూర్యునికై నమస్కారం చేసేవారి సకలపాపాలు ఆ క్షణంలోనే నశిస్తాయనడంలో సందేహం లేదు.
● భక్తిప్రపత్తులతో సూర్యునికి (ఆత్మ)ప్రదక్షిణ చేసేవారు సప్తద్వీపములతో కూడిన భూమి చుట్టూ ప్రదక్షిణ చేసిన ఫలాన్ని పొందుతారు.

- వాగ్దేవీ వరపుత్ర, సమన్వయ సరస్వతి, శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు . 

Aditya, Surya, sungod, sun god, anugraham

#aditya #surya #sun #anugraham #samavedamshanmukhasharma

Quote of the day

The Vedanta recognizes no sin it only recognizes error. And the greatest error, says the Vedanta is to say that you are weak, that you are a sinner, a miserable creature, and that you have no power and you cannot do this and that.…

__________Swamy Vivekananda